ద్విపదభాగవతం - మధురకాండ : కంసుని మరణముఁ గని దేవతలు హర్షించుట
భవకమలాసనప్రముఖ దేవతలు
ప్రవిమలంబుగఁ బ్రణుతించిరి యెలమి
దివిబీఁటకొని మ్రోసె దేవదుందుభులు
దివిజకామినులు నర్తించిరింపార; - 240
పొరిఁబొరి మందారపుష్పవర్షములు
సురకోటి దేవకీసుతుమీఁ దఁ గురిసి
రంతట, కంసుఁడు హతుడౌట యెఱిఁగి
యంతఃపురాంగన లడలుదీపింప
నడుగులు తడబడ నాత్మలు కలఁగ
సుడివడి లోగుంది సుక్కి బల్వడిని,
నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
పరిపరివిధముల పలవించి మిగుల
నార్తనాదంబుల నందందఁ బొగిలి